బోధన్, 26 జనవరి (మన సమాచార్) :
ప్రతి ఒక్కరూ ఐక్యతా భావంతో మెలగాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పోద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం బోధన్ పట్టణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బోధన్ ఏక చక్ర సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన 101 అడుగుల జాతీయ జెండాను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేత్రుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. ఏక చక్ర సేవా సమితికి తన వంతుగా 1,10,000 రూపాయలు విరాళం అందజేస్తున్నట్లు ప్రకటించారు.
విద్యార్థిని చేసిన ప్రసంగానికి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విద్యార్థిని అభినందించారు. ముందుగా చిన్నారుల చే ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. అనంతరం ఏకఛజ్ర సేవా సమితి ప్రతినిధులను ఎమ్మెల్యే సత్కరించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో, మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అంకు సంధ్య దాము, మున్సిపల్ కమీషనర్ వెంకట నారాయణ, తహసీల్దార్ విఠల్, మున్సిపల్ కౌన్సిలర్లు, విద్యార్థిని, విద్యార్థులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.