ఇందూరులో కనుల విందుగా సంక్రాంతి సంబరాలు…
బోధన్, జనవరి 09 (మన సమాచార్):
పండగల్లో కల్లా అసలు సిసలైన పండుగ అంటే సంక్రాంతి పండుగనే చెప్పుకోవచ్చు. ఏడాదికి ఒకసారి జరిగే ఈ అతిపెద్ద పండుగ నిజానికి రైతుల పండుగ అంటూ ఉంటారు. అదేవిధంగా బోధన్ పట్టణంలోని ఇందూర్ ప్రైమరీ స్కూల్ లో సంక్రాంతి సంబరాలు కనులవిందుగా సాగాయి. సంక్రాంతి పండుగను మైమరిపించే సంక్రాంతి శోభ ఉట్టిపడేలా విద్యార్థులు పాఠశాల ప్రాంగణాన్ని తీర్చి దిద్దారు.
విద్యార్థులు తయారు చేసిన గ్రామీణ వాతావరణ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. పలువురు విద్యార్థులు సంక్రాంతి ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా అధ్యక్షులు, ఇందూరు విద్యాసంస్థల కరస్పాండెంట్ కొడాలి కిషోర్ మాట్లాడుతూ పండుగల గురించి విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే అవగాహన కలిగి ఉండాలన్న ఉద్దేశంతో ఇలాంటి సంబరాలు చేపట్టడం ఎంతో అభినందనియమని అన్నారు.
తెలుగు సంస్కృతి ఉట్టి పడేలా చిన్నారులు నిర్వహించిన ప్రదర్శనలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయని అన్నారు. ఎంత ఎదిగినా కానీ విద్యార్థులు సంస్కృతి సంప్రదాయాలపై ఎప్పటికీ మక్కువతో చొరవ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇందూర్ ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ పావులూరి సుధారాణి, విద్యవికాస్ కళాశాల ప్రిన్సిపాల్ వై.శ్రీనివాస్ రావు, ప్రైవేటు విద్యాసంస్థల బోధన్ అధ్యక్షుడు ముస్త్యాల హరి కృష్ణ, ఆయా పాఠశాలల ప్రతినిధులు సురేష్, జయ ప్రకాష్, లయన్స్ ప్రతినిధి శ్యాంసుందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.