ఎమ్మెల్సీ స్థానాలకు మోగనున్న ఎన్నికల నగారా...!



మన సమాచార్ - హైదారాబాద్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తుంది. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, అదిలాబాద్ జిల్లాలతో పాటు ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకునే వారికి ఈ నెల 30 నుంచి ఓటరు నమోదు ప్రక్రియకు ఎన్నికల కమీషన్ శ్రీకారం చుట్టింది. నవంబర్ 6వ తేదీలోపు గ్రాడ్యుయేట్ లు, టీచర్లు ఓటు హక్కు నమోదు చేయించుకోవడానికి అవకాశం కల్పించింది. డిసెంబర్ చివరి నాటికి పూర్తి స్థాయి ఓటరు నమోదు జాబితాను రూపొందించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తారు.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది