బోధన్ కు హైడ్రా...? - కబ్జాలతో చిక్కి పోతున్న చెక్కి, పాండు చెరువులు...!

 



  • ఇళ్ళు నిర్మించుకున్న వారికి కౌన్సిలర్ల వత్తాసు.
  • నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ళ నంబర్ల కేటాయింపు.
  • ఇంటి నంబర్ 50 వేలు వసూలు చేస్తున్న మున్సిపల్ సిబ్బంది.

మన సమాచార్ - బోధన్

పట్టణంలోనీ సాగునీటి  చెరువులు, కుంటలు కబ్జా లకు గురి అయి రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు, మున్సిపల్ సిబ్బంది కి, కౌన్సిలర్ లకు కాసులు కురిపిస్తున్నాయి. పట్టణంలోని చెక్కి చెరువు  కబ్జాల పర్వం పై రైతులు లబోదిబో మని మొత్తు కున్నప్పటికి ఫలితం లేకుండా పోయింది. పట్టణ శివారులో ఉన్న చెరువులను కబ్జాదారులు  అధికారుల అండదండలతో కబ్జా చేసుకుని వెంచర్లు ఏర్పాటు చేసి విచ్చలవిడిగా అమ్మకాలు కొనసాగించారు. 64 ఎకరాల  విస్తీర్ణం లో గల చెక్కి చెరువు 20ఎకరాలకు పైగా కబ్జాకు గురి అయింది. ప్రతి సంవత్సరం  జనవరి నుంచి జూన్ వరకు ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతూ ఉంటాయి. ప్రతిసంవత్సరం పది నుంచి ఇరవై వరకు నూతన ఇళ్ళ నిర్మాణాలు జరుగుతుంటాయి. చెరువులో నీళ్ళు, నీటి మట్టం తగ్గి పోయిన వెంటనే మొరమ్ తో భర్తీ చేస్తారు. చెరువు నిండితే వర్షపు నీరు ఇంటిలోకి రాకుండా ముందస్తుగా మట్టి మోరంతో భర్తీ చేసిన అనంతరం ఇంటి నిర్మాణం చేపడతారు. ముగ్గురు కౌన్సిలర్ల పరిధిలో చెరువు విస్తరించి ఉంది. నిర్మాణ సమయంలో స్థానిక రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ఇందుకు కొందరు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు సహకరం అందిస్తుంటారు. ప్రతి సంవత్సరం ఇళ్ళ నిర్మాణలపై  ఉన్నత అధికారులకు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందనీ స్థానిక రైతులు వాపోతున్నారు. చెరువు నీటిని పూర్తి స్థాయిలో పంటలకు వినియోగించక ముందే  చెరువు గేట్లు రాత్రి సమయాలలో లేపి నీటిని ఖాళీ చేయిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేసిన సంఘటనలు అనేకం. ఇదే సమయంలో మత్సకారులు సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీటిని అక్రమంగా వదిలి వేయడం  చెరువు ఆక్రమణలకు గురి కావడంతో చేపలు పెంపకం ఇబ్బందిగా మారి తమ ఉపాధి అవకాశాలు దెబ్బ తింటున్నాయని వాపోతున్నారు. అధికారులు తగిన గుర్తింపు పత్రాలను పరిశీలించ కుండానే ఇంటి నబర్ల కేటాయింపు చేస్తున్నారు. ఇందు కోసం యాబై వేల వరకు మున్సిపల్ పట్టణ ప్రణాళిక విభాగం వసూలు చేస్తుంది. ఇంటికి యాజమాన్యపు హక్కులు కల్పించడంలో మున్సిపల్ బిల్ కలెక్టర్ లు కీలక పాత్ర పోషిస్తున్నారు. పట్టణంలోని మున్సిపల్ యంత్రాంగం సహయ సహకారాల ద్వారా చెరువుల కబ్జాలు నిర్మాణాలు సులువుగా మారిపోయింది. చూసి చూడనట్లు వదిలి వేస్తే చెరువు పూర్తిగా మాయం అయి నిర్మాణాలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరువులను సంరక్షించాలన్న ఉద్దేశంతో  ఏర్పాటు చేసిన  హైడ్రా తరహా వ్యవస్థను ఉపయోగించి బోధన్  చెరువులలో చేపట్టిన కబ్జాలను తొలగించి చెరువులను సంరక్షించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది