జి.హెచ్.యం.సి కమీషనర్ ఆమ్రపాలిని కలిసిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి...!

 



మన సమాచార్- అల్వాల్


మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని ఏడు కాలనీలకు డ్రైనేజీ ఔట్లేట్ సమస్యను పరిష్కరించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. జీ హెచ్ ఎం సి కమిషనర్ అమ్రపాలిని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి మంగళవారం కలిసి సమస్యలను విన్నవించారు. ఏడు కాలనీల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, దానిని వెంటనే పరిష్కరించాలని అన్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయకుండానే బహుళ అంతస్తుల బిల్డింగులకు అనుమతులివ్వడం, పాత డ్రైనేజీ వ్యవస్థలోనే కలపడం ద్వారా చాలా ప్రాంతాల్లో డ్రైనేజీ మురుగు నీరు రోడ్ల పైకి ప్రహహిస్తుందని తెలిపారు. తుర్కపల్లి ప్రాంతంలోని మడుకట్ల బస్తీ, శ్రీదామ్ ఎంక్లేవ్ ప్రాంతాలకు హకీంపేట ఎయిర్ ఫోర్స్ లోపలి నుండి వర్షపు నీటి ప్రవాహం చేరడంతో వర్షాకాలంలో రోడ్లు నదులను తలపిస్తున్నాయని అన్నారు. ఇటీవలి ఎయిర్ ఫోర్స్ స్టేషన్  హకీంపేట్  చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వర్మను ఈ సమస్య పై కలవడం జరిగిందని, వారు సానుకూలంగా స్పందిస్తూ అవసరమైన చోట ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకొని పైప్ లైన్ ద్వారా నీటిని బయటకు పంపుతామని చెప్పారని అన్నారు. జీహెచ్ ఎంసీ కూడా సహకరించాలని, నాలా నిర్మిస్తే సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది కమిషనర్ ఆమ్రపాలితో వివరించారు. మల్కాజిగిరి, అల్వాల్ సర్కిల్ బల్దియా అధికారులు కనీస ప్రోటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా పలు అభివృద్ధి అంశాల పై జీ.హెచ్.యం.సి. కమిషనర్ తో ఎమ్మెల్యే చర్చించారు. ఎమ్మెల్యే వెంట సీనియర్ నాయకులు రావుల అంజయ్య, బద్దం పరశురామ్ రెడ్డి, కరంచంద్, జీ.కే హనుమంత  రావు, డోలి రమేష్, ఉపేందర్ రెడ్డి, అనిల్ కిషోర్, రాము యాదవ్ వెంకటేశ్ యాదవ్, సందీప్ రెడ్డి , ఏడు కాలనీల సభ్యులు పాల్గొన్నారు.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది