తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వాడిన ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలి - ఎత్తోండ రాజేందర్

 


మన సమాచార్ బోధన్

పవిత్ర తిరుమల తిరుపతి లడ్డుకు ఆవు నెయ్యికి బదులు కూరజంతువుల నెయ్యి వాడిన అప్పటి ప్రభుత్వం పై చర్య తీసుకోవాలని నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఎత్తోండా రాజేందర్ డిమాండ్ చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుపై గత వైయస్సార్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి లడ్డూను కల్తీ పదార్థాలతో తయారు చేయడం శోచనీయమన్నారు. ప్రపంచంలోనే తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు తయారీలో కల్తీకి పాల్పడిన  అప్పటి టీటీడీ దేవస్థానం చైర్మన్ గా ఉన్న  వైబి సుబ్బారెడ్డి తో పాటు వైయస్సార్ పార్టీకి చెందిన నాయకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెంటనే వై బి సుబ్బారెడ్డిని, అప్పటి వైయస్సార్ పార్టీకి చెందిన నేతలను  సిబిఐ ఎంక్వైరీ చేసి వెంటనే అరెస్టు చేయాలని,  ఎంతటివారైనా వదలకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రాజేందర్ కోరారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది