మన సమాచార్ - బోధన్
రైతులకు నాణ్యమైన క్రిమిసంహారక మందులు ఎరువులు మాత్రమే విక్రయించాలని డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి ఎంఎ అలీం సూచించారు. బోధన్ డివిజన్ లోని ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తన విక్రయ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రైతులకు అవసరమైన వాటిని విక్రయించాలని సూచించారు. నాసిరకం మందులు, ఏరువులు విక్రయించడం ద్వారా రైతులు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుందని అన్నారు. స్వలాభం కోసం రైతులను మోసం చేయవద్దని డీలర్లకు సూచించారు. నాసిరకం క్రిమి సంహారక మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెoజల్, ఎడపల్లి, నవీపేట్, బోధన్ మండ లాల లోని డీలర్ లతో సమావేశం కొనసాగింది. వ్యవసాయ శాఖ అధికారులు సంతోష్, లక్ష్మీకాంత్ రెడ్డి, సిద్ది రామేశ్వర్, నవీన్ లు పాల్గొన్నారు.