రాజి మార్గమే రాచమార్గం - బోధన్ కోర్టులో లోక్ అదాలత్...!

 


మన సమాచార్ - బోధన్ 

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. పరస్పర అంగీకారంతో తో కేసులు రాజీ చేసుకోవడానికి వీలుగా లోక్ అదాలత్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. సివిల్, రాజీ కుదుర్చుకునే సెక్షన్ లలో ఉన్న క్రిమినల్ కేసులు లోక్ అదాలత్ లో పరిష్కారం కానున్నాయి. లోక్ అదాలత్ లో నాలుగు బెంచిలను ఏర్పాటు చేశారు. మొదటి బెంచ్ లో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, అడిషనల్ సెషన్స్ జడ్జి ఎస్.రవికుమార్ కేసులను పరిష్కరించారు. బెంచి సభ్యులుగా  సీనియర్ న్యాయవాది మధు సింగ్ ఉన్నారు. 


రెండోవ బెంచ్ లో సీనియర్ సివిల్ జడ్జి డీ.అజయ్ కుమార్, బెంచి సభ్యులుగా మారుతి రావు ఖన్నా వ్యవహరించారు. మూడవ బెంచ్ లో న్యాయమూర్తి ఎం.పూజిత, బెంచి సభ్యులుగా సీహెచ్ హన్మంతు రావు, నాలుగవ బెంచ్ లో అదనపు జూనియర్ సివిల్ జడ్జి సాయి శివ, బెంచి సభ్యులుగా జి.కల్యాణి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోశెట్టీ, న్యాయవాదులు సంగం, సమ్మయ్య, వాజిద్, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది