బోధన్, జనవరి 02 (మన సమాచార్):
కుదిరిన ఒప్పందం ప్రకారం వేతనాలు చెల్లించాలని, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ హమాలీలకు కూలి రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఎం ఎల్ ఎస్ పాయింట్ వద్ద కార్మికులు నిరవధిక దీక్ష చేపట్టారు. పెరిగిన రేట్ల ప్రకారం క్వింటాల్ కు 29రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సివిల్ సప్లై రాష్ట్ర కమిషనర్ తో హామాలీలు చర్చలు జరిపినట్లు వివరించారు. చర్చల సందర్భంగా అమలు చేసిన జివో ప్రకారం వేతనాలు విడుదల చేయాలని కోరారు. ప్రస్తుతం క్వింటాళ్ల కు 26 రూపాయలు మాత్రమే చెలిస్తున్నారని అన్నారు. ఈ మొత్తాన్ని 29 రూపాయలకు పెంచాలని అన్నారు. అదే విధంగా కార్మికులకు, స్విపర్లకు పది లక్షలు ఆరోగ్య భీమా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏ ఐ టి యుసి ఆధ్వర్యంలో కార్మికులు గోదాములకు తాళం వేసి ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమం లో హమాలీ కార్మికులు పాల్గొన్నారు.