సిండికేట్ కల్లు వ్యాపారం పై చర్యలు తీసుకోవాలి - ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు పి. వరదయ్య..!



నిజామాబాద్, డిసెంబర్ 23 (మన సమాచార్):

నిజామాబాద్ నగరంలో సిండి కేట్ గా ఏర్పడి కల్లు దందా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఐ ఎఫ్ టీ యూ జిల్లా అధ్యక్షుడు పి.వరదయ్య డిమాండ్ చేశారు. సిండికేట్ కల్లు వ్యవహారం పై చర్యలు తీసుకోవాలని కోరుతూ  సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, ఐ ఎఫ్ టీ యూ నాయకులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు కు సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వరదయ్య మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని 1 వ నంబర్, 2 వ నంబర్ కల్లు గీత కార్మిక సొసైటీ లు సిండికేట్ అయి కల్లు వ్యాపారం చేస్తున్నారని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు పిర్యాదు చేసినట్లు తెలిపారు. సహకార శాఖ నిబంధనలకు, ఎక్సైజ్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారం నడుస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గు చేటని అన్నారు. నగరంలో కృత్రిమ కల్తీ కల్లు ఏరులై పారుతున్నా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. మాదకద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణ చేయాలని ప్రభుత్వం చెబుతున్నా అధికారులు స్పందించడం లేదని తెలియచేశారు. నగరంలో జరుగుతున్న సిండికేట్ కల్లు వ్యాపారంపై, కృత్రిమ కల్తీ కల్లు వ్యాపారంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి బి బాస్కర్, ఏ ఐ కే ఎం ఎస్ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి, నాయకులు దుడ్డు గంగాధర్, ఐ ఎఫ్ టీ యూ జిల్లా ఉపాధ్యక్షుడు శివ రాజు, నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది