తెలంగాణ ను ప్రపంచ బ్యాంక్ కు తాకట్టు పెడుతున్న ప్రభుత్వం - ఎమ్మెల్సీ కవిత...!

 


హైదారాబాద్, డిసెంబర్ 18 (మన సమాచార్):

మూసి సుందరీకరణ పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంక్ కు తాకట్టు పెడుతున్నారని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. శాసన మండలి సమావేశాల సందర్భం గా మీడియా పాయింట్ వద్ద విలేకరులకు వివరించారు.మూసి సుందరీకరణ ప్రాజెక్టు కోసం ప్రపంచబ్యాంకు ప్రతి పాదనల డీపీఆర్ సిద్ధం చేసినట్లు వివరించారు. ప్రపంచ బ్యాంకు కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను బహిర్గ బంద్ చేశారు. మూసి పరివాహక ప్రాంతంలో పేద ప్రజల నుంచి భూములను లాక్కొని ప్రపంచ బ్యాంకు కు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు స్పష్టం చేశారు. 10 సంవత్సరాల టిఆర్ఎస్ హయాంలో వినం కోసం ప్రపంచ బ్యాంకు ఆశ్రయించలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన ఏడాది లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను హైదరాబాదులో ప్రపంచ బ్యాంకు తాకట్టు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. మూసి ప్రాజెక్ట్ పై శాసన సభలో ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి, ప్రపంచ బ్యాంకుకు, శాసనసభకు ,పేద ప్రజలకు వేరువేరు సమాధానాలు చెబుతుందని అన్నారు. మూసి పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలలో భయానక పరిస్థితి నెలకొందని అన్నారు. 25వేల ఇళ్లకు మార్కింగ్ వేయడం జరిగిందన్నారు. వాటిని ఎప్పుడు కూల్చుతారో అనే భయం లో ప్రజలు ఉన్నారని అన్నారు. తెలంగాణ తల్లి రూపు రేఖలు మార్చే విషయం లో ప్రభుత్వం రహస్యం గా వ్యవహరించిందని అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది