బోధన్, డిసెంబర్ 17 (మన సమాచార్):
బోధన్ పట్టణ శివారులో ట్రాన్స్ఫార్మర్ సామాగ్రి చోరీ చేసి తీసుకు వెళుతున్న ఇద్దరు దొంగలను సిసిఎస్ ఏసిపి నాగేంద్ర చారితో కలిసి పట్టుకున్నట్లు బోధన్ పట్టణ ఎస్ హెచ్ ఓ వి.వెంకటనారాయణ తెలిపారు. బోధన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్ హెచ్ ఓ వెంకటనారాయణ మాట్లాడుతూ బోధన్ పట్టణ శివారులోని బాబా గార్డెన్ సమీపంలో సిసిఎస్ పోలీసులతో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా బోధన్ పట్టణానికి చెందిన సయ్యద్ ముహమ్మద్, షేక్ అన్సార్ లు ద్విచక్ర వాహనంపై రాగి వైరు తీసుకు వెళుతుండగా వెంబడించి పట్టుకున్నామని తెలిపారు. వీరు గత నెలలో అన్సార్ ఖాన్, షేక్ తాహెర్, మహమ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ అయాన్ లతో కలిసి ఆయాన్ కు చెందిన ఆటోలో ట్రాన్స్ ఫార్మర్ ఆయిల్ లను, రాగి వైర్లను దొంగతనం చేసేందుకు రాత్రి సమయంలో మాక్లూర్ మండలంలోని చిక్కిలి గ్రామ శివారులో వెళ్లారు. ట్రాన్స్ ఫార్మర్ కరెంట్ వైర్ లను ఆయాన్ తొలగిస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ కేసులో హుస్సైన్ ఖాన్ @ అన్సార్ ఖాన్, తాహెర్ లు మరికొంత మంది పై కేసు అయిందని, ఇప్పటికే అన్సార్, తాహెర్ లు అరెస్టు అయ్యి ప్రస్తుతము జైలులో ఉన్నారని వివరించారు. పట్టుబడ్డ దొంగల వద్ద నుండి 18 కిలోల రాగి వైర్, ఒక మోటార్ సైకిల్, రెండు పానాలు, రెండు మొబైల్ ఫోన్ లు స్వాదినం చేసుకొని వారిని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. వీరు నిజామాబాద్ జిల్లా లోని బోధన్ టౌన్, బోధన్ రూరల్, రుద్రూర్, వర్ని, కోటగిరి, ఎడపల్లి, రెంజల్, నవీపేట్, నందిపేట్, నిజామాబాద్ రూరల్ పరిది లో మొత్తం 28 కేసులను ఛేదించిన సిసిఎస్ సీఐ సురేశ్, రవీందర్, హోమ్ గార్డ్ గిరి, పోలీసు కానిస్టేబుల్ రాజేంద్ర ప్రసాద్, బోధన్ టౌన్ ఎస్ హెచ్ వో వి. వెంకట నారాయణ, సిబ్బంది పిసి శ్రీకాంత్ లను నిజామాబాద్ సిపి సింధు, ఎసిపి శ్రీనివాస్ లు అబినందించారు.