ప్రభుత్వం లగచర్ల రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి...!


బోధన్, డిసెంబర్ 17 (మన సమాచార్):

ప్రభుత్వం లగచర్ల రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బిఆర్ ఎస్ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ సత్యవతి డిమాండ్ చేశారు. లగచర్లలో ప్రభుత్వం రైతులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బిఆర్ ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం నియామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఆచన్ పల్లి లో గల బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోడంగల్ నియోజక వర్గంలో హార్యా నాయక్ అనే రైతుకు బేడీలు వేసి చిత్రహింసలకు గురిచేయడాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. రైతు పక్షపాతి కేసీఆర్ అయితే, రైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. ఒక సంవత్సర పాలనలోనే ప్రజలకు అర్ధం అయిందని అన్నారు. రాష్ట్రంలో రైతు వ్యతిరేఖ పాలన కొనసాగుతుందన్నారు. లగచర్ల రైతులను ఆరు నెలలుగా ఇబ్బందులకు గురిచేయడంతో పాటు వారిని చత్రహింసలు పెట్టడం అప్రజాస్వామికమని విమర్శించారు. వెంటనే రైతులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు ఎన్.గౌతమ్ ప్రసాద్, సుభాష్, కళ్యాణ్, స్వరూప, శారధ, రాము, కిషోర్ తదితరులు ఉన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది