సర్వే పకడ్బందీగా నిర్వహించాలి - కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు...!

 


బోధన్, డిసెంబర్ 17 (మన సమాచార్):

ఇందిరమ్మ ఇళ్ల సర్వే ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అన్నారు. బోధన్ లో మంగళవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. సర్వే జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. సర్వేలో పొరపాట్లు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. లబ్ధిదారుల సమాచారం, ఫోటో నమోదు ప్రక్రియలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న సమయంలో ఉండి ఇప్పుడు చనిపోయిన వారు ఎవరైనా ఉంటే అటువంటి వాటికి పక్కన ఉంచాలని, ప్రభుత్వం ద్వారా తదుపరి వచ్చే ఆదేశాల అనంతరం వాటిని సర్వే చేయడం జరుగుతుందన్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది