బోధన్, డిసెంబర్ 17 (మన సమాచార్):
లగచర్ల రైతులను తక్షణమే విడుదల చేయాలని బిఆర్ ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లగచర్ల లో రైతులను అరెస్టు చేయడం శోచనీయమన్నారు. ఆరోగ్యం బాగు లేని రైతు చేతికి బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకుపోవడం బాధాకరమన్నారు. ఇంతటి నిర్బంధం కాంగ్రెస్ లో నే జరుగుతుందన్నారు. తక్షణమే రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.