బిఆర్ ఎస్ ప్రమాద భీమా చెక్కు పంపిణీ చేసిన అయేషా ఫాతిమా...!


బోధన్, జనవరి 06 (మన సమాచార్):

రోడ్డు ప్రమాదంలో మరణించిన బోధన్ మండలంలోని బెల్లాల్ గ్రామానికి చెందిన కట్ట గంగాధర్ కుటుంబీకులకు తాజా మాజీ ఎమ్మెల్యే సతీమణి, టీఆర్ ఎస్ నాయకురాలు అయేషా ఫాతిమా చేతుల మీదుగా ప్రమాద భీమా చెక్కును సోమవారం పంపిణీ చేశారు.  భార్య కట్ట పద్మకు రెండు లక్షల రూపాయలు ప్రమాద బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా అయేషా ఫాతిమా మాట్లాడుతూ బిఆర్ ఎస్ సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తకు ప్రమాద భీమా వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ కుమార్, పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, బోధన్ నియోజకవర్గ యువజన అధ్యక్షుడు తోట శ్రీనివాస్, బోధన్ మండల యువజన అధ్యక్షుడు గణేష్ పటేల్, బర్దిపూర్ మాజీ సర్పంచ్ సాయిరెడ్డి, బెల్లాల్ పార్టీ నాయకులు బుర్రి లక్ష్మణ్, రాజు, శ్రీనివాస్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది