దుకాణాల సమయాన్ని పెంచాలని ఏసిపికి వినతి...!


బోధన్, జనవరి 02 (మన సమాచార్):

రాత్రి సమయంలో దుకాణాలను తెరిచి ఉంచే సమయాన్ని పెంచాలని కోరుతూ ఎంఐఎం నాయకులు బోధన్ ఎసిపి శ్రీనివాస్ కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ మాట్లాడుతూ ప్రతిరోజు 9:30 గంటలకే దుకాణాలను మూసివేయాలంటూ పోలీసులు దుకాణాల వద్దకు వచ్చి నిలబడుతున్నారని తెలిపారు. దీంతో హడావిడి ఉండడంవల్ల వినియోగదారులకు సరైన సేవలు అందించలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పండ్ల వ్యాపారులు, హోటల్ల నిర్వాహకులు, బట్టల దుకాణాలు తదితర వాటిని తొమ్మిదిన్నర నుంచి పదిన్నర వరకు మూసివేసే క్రమంలో పోలీసులు ఇష్టానుసారంగా ఫోటోలు కొడుతూ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా బోధన్ లో దుకాణదారులపై, హోటల్ల నిర్వాహకులపై కేసులు అయ్యాయని, జైలు శిక్షలు పడ్డాయని తెలిపారు. పట్టణ సీఐ వెంకట నారాయణ దుకాణదారుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని, ఇంతటి నిక్కచ్చిగా పనిచేసే అధికారి అవసరమేనని, కానీ నిజాయితీగా పనిచేసుకునే దుకాణదారుల పట్ల ఈ విధంగా వ్యవహరించడం బాధాకరమని అన్నారు. బోధన్ లో అనేక రకమైన సాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే వాటిని కట్టడి చేయడంలో దృష్టి పెట్టాల్సిన పోలీసులు కేవలం దుకాణాలను మూసి వేయించే పనిలో మాత్రమే ఉండడం శోచనీయమన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్నట్లుగానే బోధన్ లో సైతం రాత్రి 11:30 గంటల వరకు దుకాణాలను తెరచి ఉంచే విధంగా వెసులుబాటు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సమీ, అఖిల్, సమీర్, అలీమ్, రషీద్, అతర్, తదితరులు ఉన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది