బోధన్, జనవరి 02 (మన సమాచార్):
లక్ష్యం ఎంత ఉన్నతంగా ఉన్న ప్రణాళికలు ఎంత పక్కాగా ఉన్న అవి ఆచరణలో లేకుంటే అంతా శూన్యమేనని బోధన్ ఎసిపి శ్రీనివాస్ అన్నారు. బోధన్ బ్రాహ్మణ సేవా సమాజ్ ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఏసిపి శ్రీనివాస్, పట్టణ సీఐ వెంకట నారాయణల చేతుల మీదుగా గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాలెండర్ ఏడాదికోసారి మారుతూ ఉంటుందని, మనిషి ఆలోచనలో, ఆచరణలో, ప్రవర్తనలో, జీవన శైలిలో కూడా మార్పు వచ్చేలా నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమాజ్ అధ్యక్షులు ప్రవీణ్ మహారాజ్, ప్రధాన కార్యదర్శి వైద్య ఉమానంద్, కోశాధికారి అయినం పూడి చక్రవర్తి, విజయ సాయి హై స్కూల్ ప్రిన్సిపల్ కృష్ణమోహన్, అంతోని స్కూల్ చైర్ పర్సన్ వైద్య మనోజ్ కుమార్, చీఫ్ అడ్వైజర్ రామారావు, ఆర్గనైజర్ సెక్రెటరీ మదన్ రావు, అశోక్ రావు కులకర్ణి, వినోద్ పట్వారి, యోగి రాజు వైద్య తదితరులు పాల్గొన్నారు.