ప్రశాంతంగా రేషన్ డీలర్ల రాత పరీక్ష - డీలర్ల రాత పరీక్షకు 179 మంది హాజరు...!

మన సమాచార్ - బోధన్

నిజామాబాద్ జిల్లా బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో మంగళవారం నిర్వహించిన రేషన్ డీలర్ల రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 180 మంది అభ్యర్థులను అర్హులుగా ఎంపిక చేసిన అధికారులు మంగళవారం రాత పరీక్ష నిర్వహించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 179 మంది హాజరయ్యారు. ఒక్కరు గైర్హాజరయ్యారు. ఎడపల్లి, కోటగిరి, బోధన్, సాలూరు మండలాలలో ఖాళీగా ఉన్న 18 రేషన్ డీలర్ల షాపులలో డీలర్ల భర్తీకి రాత పరీక్ష నిర్వహించారు.  అభ్యర్థుల మార్కుల జాబితాను సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద గోడపై ప్రదర్శించారు. మార్కుల జాబితా ప్రదర్శించడం తో రాత పరీక్ష రాసిన అభ్యర్థులతో సబ్ కలెక్టర్ కార్యాలయం కిక్కిరిసింది. మెరిట్ సాధించిన వారికి త్వరలో ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది