హెల్త్ ప్రొఫైల్ డిజిట లైజేషన్ కు చర్యలు - సీఎం రేవంత్ రెడ్డి ...!


మన సమాచార్ - హైదారాబాద్

ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ ను డిజిటలైజేషన్ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దుర్గాబాయి దేశ్ ముఖ్ రెనోవ క్యాన్సర్ సెంటర్ ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ ప్రొఫైల్ అందుబాటులో లేకపోవడంతో ప్రతిసారి ప్రాథమిక పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు. ఇందువల్ల రోగులకు సైతం ఆర్థిక భారం పడుతుందన్నారు. 



త్వరలో ప్రతి వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ కు సంబంధించిన డిజిటల్ కార్డులను నమోదు చేస్తున్నట్లు వివరించారు. పేదలకు వైద్య సేవలు అందించడంలో దుర్గాబాయి దేస్ ముఖ్ ఆసుపత్రి మరో ముందడుగు వేసిందన్నారు. క్యాన్సర్ చికిత్స పేదలకు అందు బాటులో ఉండటం లేదన్నారు. రాష్ట్రంలో క్యాన్సర్ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని అన్నారు. విద్యా వైద్యం అందించడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని వివరించారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది