సీనియర్ జర్నలిస్ట్ కు యూనివర్సిటీ అఫ్ తొలస ఇంటర్ నేషనల్ అవార్డు...!



మన సమాచార్ - జుక్కల్

జుక్కల్ నియోజకవర్గ సీనియర్ జర్నలిస్ట్ జాదవ్ వీరన్న కు యూనివర్సిటీ అఫ్ తొలస మాక్సికో వారి ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు దక్కింది. గురువారం కర్ణాటక బీదర్ జిల్లా కేంద్రంలోని అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డు అందజేశారు. గతంలో అక్షరస్యత, మూఢ నమ్మకాలు, ఎయిడ్స్ రహిత సమాజం, ప్లాస్టిక్ రహిత సమాజం, అంటరానితనం, కుటుంబ నియంత్రణ కార్యక్రమల్లో ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు తమ వంతు పాత్రను పోసించినందుకు గాను అవార్డు ప్రధానం చేశారు. ఈ సందర్బంగా అవార్డు గ్రహీత వీరన్న మాట్లాడుతు ప్రస్తుత సమాజంలొ ప్రతి వ్యక్తి తనకోసం తాను కాకుండా సమాజం కోసం పాటుపడుతూ సమాజం గర్వించే విధంగా అనేక సామాజిక కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందినప్పుడే అది అసలైన మరిచిపోలేని అవార్డు అని అన్నారు. ఈ కార్యక్రమంలొ యూనివార్సిటీ అఫ్ తొలస మెక్సికో కంట్రి డైరక్టర్ డాక్టర్. కె. కట్ట బామ్మన్, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ శోభారాణి, అవార్డు కో ఆర్డినేటర్ దంతుల్వర్ సోపాన్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది