మన సమాచార్ - కామారెడ్డి
నిర్ణీత గడువులోగా సి.ఏం.ఆర్. బియ్యం సరఫరా చేయని వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం రోజున కలెక్టర్ ఛాంబర్ లో పౌరసరఫరాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 30 లోగా సరఫరా చేయని పక్షంలో అపరాధ రుసుము విధించడం తో పాటు, ఈ సీజన్ ధాన్యం కేటీయింపులు జరుగవ నీ హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్ 2021-22, 2022-23 డిఫాల్ట్ అయిన మిల్లులపె క్రిమినల్ చర్యలు, రెవెన్యూ రికవరీ యాక్ట్ క్రింద చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల సంస్థ అధికారి జి. రాజేందర్, సహాయ పౌర సరఫరాల శాఖ అధికారి నరసింహారావు, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.