మన సమాచార్ - బోధన్
నిజామాబాద్ జిల్లా బోధన్, సాలుర, మోస్రా మండలాల విద్యా శాఖ అధికారులను శుక్రవారం బోధన్ ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. బోధన్ మండల పరిషత్ విద్యా శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన నాగయ్యను, సాలుర మండల విద్యా శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన మంజూషను పూలమాల శాలువాతో సత్కరించారు. బోధన్ మండల విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు నిర్వహించి బదిలీ పై మోస్రా మండల విద్యాశాఖ అధికారిగా వెళుతున్న నాగనాథ్ ను సన్మానించారు . ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ఎం.హరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి రాజు, గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్, ఇందూర్ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిషోర్ కుమార్, విజయసాయి ఉన్నత పాఠశాల మేనేజర్ ఐ ఆర్ చక్ర వర్తి, మాతృశ్రీ కరస్పాండెంట్ దిగంబర్, ప్రజ్ఞ పాఠశాల కరస్పాండెంట్ చౌడ రెడ్డి, ఉషోదయ డైరెక్టర్ సూర్య ప్రకాష్, విజయ సాయి జూనియర్ కళాశాల డైరెక్టర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.