మన సమాచార్ - బోధన్
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం లో వృద్ధుడిని తీవ్రగాయాలయ్యాయి. పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో వెళుతున్న లారీ వెనుక టైరు కింద పడటంతో లాల్ అహ్మద్ (60) కు తీవ్ర గాయలయ్యాయి. ఆచన్ పల్లి కి చెందిన లాల్ అహ్మద్ సైకిల్ పై బోధన్ వెళుతుండగా పక్క నుంచి వెళుతున్న కారు ను తప్పించ బోయి అదుపు తప్పి లారీ వెనుక టైరు కింద పడిపోవడం తో కూడి కాలికి తీవ్ర గాయలయ్యాయి. గాయ పడిన లాల్ అహ్మద్ ను చికిత్స నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్ హెచ్ ఓ వెంకటనారాయణ సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన బాధితుడిని ఆస్పత్రికి పంపించి లారీని అదుపులోకి తీసుకున్నారు.