గ్రామ తాగు నీటి సహాయకులకు శిక్షణా తరగతులు...!



మన సమాచార్ - బాన్సువాడ

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బీర్కుర్, నసురుల్లాబాద్ మండలాల పరిధిలోని మిషన్ భగీరథ  గ్రామ తాగు నీటి సహాయకులకు శుక్రవారం రైతునగర్ గ్రామంలోని రైతు వేదికలో శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లాల మిషన్ భగీరథ ఎస్ ఈ రాజేంద్ర కుమార్ పాల్గొని పలు సూచనలు ఇచ్చారు. గ్రామ సహాయకుల విధి  నిర్వహణలో  పైప్ లైన్ లీకేజ్ మరమ్మత్తులు, ప్లంబింగ్, సింగిల్, త్రిపేజ్  మోటర్ల మరమ్మతులు, ప్యానల్ బోర్డు, నీటి పరిశోధన ఏవిధంగా చేయాలి వివరించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ డిఈ వెంకటేశ్వర్ గౌడ్, బీర్కూర్ మండల ప్రత్యేక అధికారి వ్యవసాయ శాఖ ఏడీఏ అనిల్ కుమార్, ఎంపీడీవో భారతి, ఎంపీవో మహేబూబ్, ఏఈ లు జగదీష్, అశ్విని పాల్గొన్నారు.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది