తెలంగాణ కోసం సర్వస్వం ధారపోసిన ధీరుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ... !

 


మన సమాచార్- బాన్సువాడ

తెలంగాణ కోసం సర్వస్వం ధారపోసిన ధీరుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109 వ జయంతి వేడుకలను బాన్సువాడ లోని తన నివాసంలో శుక్రవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి కొండ లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాధర్, బాన్సువాడ పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ  నివాళులర్పించారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది