బ్రాహ్మణ సమాజ్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కు సన్మానం...!


మన సమాచార్ - బోధన్

నిజామాబాద్ జిల్లా బోధన్ బ్రాహ్మణ సమాజ్ ఆధ్వర్యంలో బుధవారం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ను సన్మానించారు. బ్రహ్మ సేవా సమాజ్ చేసే సేవా కార్యక్రమాలను సబ్ కలెక్టర్ కు వివరించారు. శాలువా, పుష్పగుచ్చం సబ్ కలెక్టర్ ను సత్కరించారు. అనంతరం బోధన్ ఎస్ హేచ్ వో వెంకట నారాయణను సైతం సత్కరించి ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించారు. 

అనంతరం నూతనంగా నియామకమైన బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకు సంధ్యాదామోదర్ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమాజ్ అధ్యక్షులు ప్రవీణ్ మహారాజ్, ప్రధాన కార్యదర్శి ఉమానందు వైద్య, ఉపాధ్యక్షులు యోగి రాజు వైద్య, గౌరవ అధ్యక్షులు వినోద్ పట్వారి, విజయ్ కుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు మనీషా మనోజ్ వైద్య, తదితరులు పాల్గొన్నారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది