మన సమాచార్ - బోధన్
లయన్స్ క్లబ్ జిల్లా ఎంపవర్ డెంటల్ కేర్ వీక్ ముగింపు కార్యక్రమంలో భాగంగా బోధన్ పట్టణంలోని ఆచన్ పల్లిలో గల ఇందూర్ ఉన్నత పాఠశాలలో బుధవారం దంతవైద్య శిబిరం నిర్వహించారు. బోధన్ లయన్స్ క్లబ్, లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ ఇందూర్, లయన్స్ క్లబ్ ఆఫ్ భవాని, ఆధ్వర్యంలో దంత వైద్యులు శ్రీకాంత్ దేశాయి, డాక్టర్ రమాదేవి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
విద్యార్థులకు దంత సంరక్షణ పై అవగాహన కల్పించారు. విద్యార్థులకు టూత్ పేస్ట్ లు, బ్రష్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ మాజీ జిల్లా గవర్నర్ బసవేశ్వర రావ్, పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిషోర్ కుమార్, రీజియన్ చైర్మన్ శ్రీధర్, సతీష్, పల్లెంపాటి శివన్నారాయణ, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.