అమరుల స్పూర్తితో ముందుకు సాగాలి - బోధన్ లో కామ్రేడ్ షేక్.బాబు మొదటి వర్ధంతి సభ...!

 


మన సమాచార్ - బోధన్

అమరుల స్పూర్తితో ప్రజా ఉద్యమాలకు అంకితం అవుదామని సీపీఐ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య అన్నారు. బోధన్ పట్టణంలోని పి ఆర్ టి భవన్ లో  కామ్రేడ్  షేక్ బాబు ప్రథమ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య  మాట్లాడుతూ కామ్రేడ్  షేక్ బాబు కమ్యూనిస్టు పార్టీలో పనిచేసిన కుటుంబంలో వీరులపాడులో జన్మించి బోధన్ పట్టణానికి చదువు నిమిత్తం వచ్చి  స్థిర పడ్డారని,  సిపిఐ పార్టీలో జిల్లా కార్యవర్గ సభ్యుడిగా అనేక ఉద్యమాలలో పాల్గొన్నారని గుర్తు చేశారు. అనారోగ్యంతో గత  సంవత్సరం 21 సెప్టెంబర్ న మరణించారని తెలిపారు. ఉద్యమాల పట్ల నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ఈ ప్రాంతంలో జరిగిన ఉద్యమాల్లో తన వంతు పాత్ర నిర్వహిస్తూ సిపిఐ పార్టీ నాయకుడిగా ఎదిగి ప్రజల మన్ననలు పొందారని అన్నారు. తను మన నుండి దూరమై తన ఆశయాన్ని మనపై ఉంచారని అన్నారు.  సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాల పట్ల, కమ్యూనిజం పట్ల అంకితభావంతో పనిచేసే అమరుడైన షేక్ బాబు ఆశయాలను మనమంతా ముందుకు తీసుకు పోదామని అన్నారు.  ఈ కార్యక్రమంలో  సిపిఎం జిల్లా నాయకులు ఏశాల గంగాధర్,  విద్యావేత్తలు నాగల హనుమంతరావు, రాధాకృష్ణన్, న్యాయవాది సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమలాపురం రాజన్న, సిఐటియు జిల్లా అధ్యక్షుడు శంకర్ గౌడ్, డిహెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి  జనార్ధన్, పార్టీ జిల్లా నాయకులు ఎం.సాయిలు, ఎండి.గౌస్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు అంజలి తదితర నాయకులు షేక్ బాబుకు నివాళులర్పిస్తూ మాట్లాడారు. ఈ సంతాప సభలో బోధన్ పట్టణంలోని నాయకులు, వికలాంగుల సంఘం జిల్లా కార్యదర్శి రాములు, సలీం, శంకర్ పాల్గొన్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది