కల్దుర్కిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు...!



మన సమాచార్ - బోధన్

చాకలి ఐలమ్మ పోరాట పటిమను ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని బోధన్ ఎంపీడీఓ బాల గంగాధర్ అన్నారు. గురువారం బోధన్ మండలంలోని కల్దుర్కి గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె చూపిన పోరాట పటిమను కొనియాడారు. చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు గ్రామస్తులు ఘనం గా నిర్వహించారు. భూమి కోసం భుక్తి, ముక్తి వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ తెగువ తెలంగాణ ప్రజలు మరచిపోలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి సునీత రెడ్డి, గ్రామాభి వృద్ధి కమిటీ చైర్మన్ బంటు గంగాధర్, మాజీ ఎంపిటిసి రాజన్న, ప్రకాష్ పటేల్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, దండు భూమయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది