మన సమాచార్ - బోధన్
పోరాట స్ఫూర్తికి చాకలి ఐలమ్మ ప్రతి రూపమని మార్కెట్ కమిటీ చైర్మన్ సంధ్య దామోదర్ అన్నారు. గురువారం సాలుర మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలలో ఆమె పాల్గొన్నారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటానికి ఐలమ్మ ఆధ్యురాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ గంగా శంకర్, విండో అధ్యక్షులు అల్లే జనార్దన్, నాయకులు వై.నరేందర్ రెడ్డి, అల్లే రమేష్, డిస్కో సాయిలు, ఎస్. పాండు, వెంకట్ పటేల్, షకీల్, రవి, తదితరులు పాల్గొన్నారు.