పీజీ ఫలితాలు విడుదల...!

 


మన సమాచార్ - బిచ్కుంద

 కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో పీజీ ఎం.ఏ తెలుగు, ఎం.ఏ ఇంగ్లీష్, ఎం. కామ్ కోర్సుల మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ ఫలితాలను తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల విభాగాధిపతి డాక్టర్. అరుణ చేతుల మీదుగా బుధవారం విడుదల చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ కె. అశోక్ అభినందనలు తెలిపారు. మునుముందు కూడ విద్యార్థులు తమ ఉన్నత లక్ష్యాన్ని చేరుకునేందుకు విద్యలో నైపుణ్యం కనబర్చి తమ లక్ష్యాన్ని చేరుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సి.ఓ.ఈ వై. సంజీవరెడ్డి, అధ్యాపకులు రఘునాథ్ పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది