మన సమాచార్ - బోధన్
నూతనంగా బోధన్ లో సబ్ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన వికాస్ మహతో ను బుధవారం బోధన్ జర్నలిస్టులు సన్మానించారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం జర్నలిస్టులు ఆయనను సన్మానించారు. పుష్పగుచ్చం, శాలువాతో బోధన్ ప్రింట్ మీడియా జర్నలిస్టు లు సబ్ కలెక్టర్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయా పత్రికల జర్నలిస్టులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు బలరామరాజు, ప్రింట్ మీడియా అధ్యక్షులు రవికుమార్, జర్నలిస్టులు ఉన్నారు.