రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ను సన్మానించిన మేము సైతం నవీన్...!


మన సమాచార్ - బోధన్

పంచాయితీ రాజ్ శాఖలో పదవీ విరమణ చేసిన  చీఫ్ ఇంజనీర్ గజం సీతా రాములును నిజామాబాద్ జిల్లా బోధన్ కు చెందిన మేము సైతం స్వచ్ఛంద సేవ సంస్థ చైర్మన్ నవీన్ కుమార్ హైదారాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. గతంలో గజం సీతారాములు నిజామాబాద్ జిల్లా బోధన్ లో పంచాయితీ రాజ్ శాఖ ఈ ఈ గా పని చేశారు. ఆయన జీవితం ఆరోగ్యం ఆనందం గా కొనసాగాలంటే తీసుకోవలసిన జాగ్రత్తల పై అనే పుస్తకం రచించారు. సీతారాములు యోగ, ధ్యాన కార్యక్రమాల నిర్వహణ చేపడుతుంటారు. ఆయన చేస్తున్న కార్యక్రమాలకు స్పూర్తి గా ఆయనను కలవడం జరిగిందని  నవీన్ తెలిపారు. ఈ ఈ గా బోధన్ లో ఉన్న సమయంలో అనేక మంది అన్నార్థులను మానవతా దృక్పథంతో అన్నం పెట్టి ఆదరించారని గుర్తు చేశారు.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది