ఇఫ్ఫ్టు ఆధ్వర్యం లో విప్లవ వీరులకు ఘన నివాళులు... !


మన సమాచార్ - బోధన్ 

భారత కార్మిక సంఘాల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ముక్తర్ పాషా, శ్రీకాకుళం సాయుధ పోరాట యోధురాలు పైల చంద్రక్క వర్ధంతి సభను ఇఫ్టు ఆధ్వర్యంలో నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో  ఇఫ్టు కార్యాలయంలో వారి చిత్ర పటాలను పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వరదయ్య మాట్లాడుతూ ముక్తార్ పాషా మరణం కార్మిక లోకానికి తీరని లోటని అన్నారు. విద్యార్థి దశ నుంచే కార్మికులకు జరుగుతున్న అన్యాయాల పై స్పందించి ఉద్యమ బాట పట్టారనీ అన్నారు. పూర్తి స్థాయిలో జీవితాన్ని విప్లవోద్యమానికి అంకితం చేసిన వ్యక్తి అన్నారు. ఎన్నో చిత్ర హింసలను నిర్బండలను అధిగమించి పైల చంద్రక్క విప్లవ ఉద్యమం లో చివరి వరకు నిలబడిందన్నారు. ఈ కార్యక్రమం లో ఈఫ్టు బోధన్ ఏరియా నాయకులు సురేష్, పివైల్ రాష్ట్ర నాయకులు  శ్రావణ్, రాజ శేఖర్ నాయకులు లక్ష్మణ్ గౌడ్, రాజేందర్ గౌడ్, జగదీశ్ చందు తది తరులు పాల్గోన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది