తగ్గెల్లి పాఠశాలలో వైద్య శిబిరం...!

 


మన సమాచార్ - బోధన్

నిజామాబాద్ జిల్లా సాలుర మండలంలోని తగ్గెల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రీయ బాల స్వస్తీయ కార్యక్రమంలో భాగంగా ఈ వైద్య పరీక్షలు నిర్వహించారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు డాక్టర్ శ్రీనివాస్ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. వైరల్ జ్వరాలు వ్యాపిస్తున్న దృష్ట్యా ఈ వైద్య పరీక్షలు చేపట్టారు. ఏడుగురు విద్యార్థులను మెరుగైన చికిత్సలు కోసం బోధన్ లోని జిల్లా ఆసుపత్రికి సిఫార్సు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది శ్వేత, ఫాతిమా ప్రధానోపాధ్యాయులు ధన్ రాజ్, ఉపాధ్యాయులు కస్తూరి, విజయ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది