ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలి - పోషణ్ అభియాన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే తోట..!


మన సమాచార్ - జుక్కల్

ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కోసం అభియాన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టత్మకంగా అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ కార్యక్రమంలొ భాగంగా మంగళవారం జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద, మొహమ్మద్ నగర్ మండల కేంద్రాల్లో చేపట్టిన కార్యక్రమంలొ ముఖ్య అతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, శిశువులు తీసుకోవాల్సిన పౌష్టిక ఆహారం, పోషక ఆహర లోపల పై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని సూచించారు. ఒక తల్లి గర్భం దాల్చిన నుంచి మొదలు శిశువుకు జన్మనిచ్చిన 3 సంవత్సరాలు పోషక ఆహారం లభించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతుందన్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో పోషణ్ అభియాన్ పోషణ మహోత్సవ కార్యక్రమాలు చేపట్టుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. పౌష్టిక ఆహార లోపం వల్ల రక్త హీనత, జనన బరువు తగ్గుదల తదితర ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని, ఆరోగ్య సమస్యలు తలెత్తకుండ ముందస్తు జాగ్రత్తగా ప్రతి గర్భిణీ స్త్రీ తప్పకుండ సరైన పౌష్టిక ఆహారం తీసుకోవాలని, తద్వారా తల్లి బిడ్డలకి ఎలాంటి పోషకహార లోపం లేకుండ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ప్రతి బాలింత స్త్రీ తప్పకుండ పుట్టిన ప్రతి బిడ్డకు గంటలోపు ముర్రు పాలు పట్టించాలని, ఆరు నెలల పాటు తల్లి పాలు బిడ్డకు ఆహారంగా ఇవ్వాలని సూచించారు. 


దీనిపై ప్రతి సి డి పి ఓ, సూపర్ వైజార్, అంగన్వాడీ టీచర్లు తల్లులకు అవగాహన కల్పించాలని, ప్రభుత్వం ద్వార సరఫరా చేస్తున్న పౌష్టిక ఆహార పదార్థాలను సమయానికి అందజేయ్యాలని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాలలో సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాల సమస్యలు తన దృష్టికి వచ్చిందని త్వరలోనే వాటిని పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలొ దర్పల్ గంగాధర్, పి సి సి డెలిగేట్ విట్టల్ రెడ్డి,తెలంగాణ కాంగ్రెస్ యువజన రాష్ట్ర కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి, సాయిని అశోక్, మునీనరోద్దీన్, అజ్జు, మల్లికార్జున్, జయప్రదీప్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గోపాల్ రెడ్డి, హన్మంత్ పాటిల్, సి డి పి ఓ, సూపర్ వైజార్లు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది