విద్యార్థిని చితకబాదిన మరో విద్యార్థి మాతృమూర్తి… ప్రభుత్వ కళాశాలలో ఘటన...!

 


  • విద్యార్థుల మధ్య సద్దుమనిగిన గొడవలో కుటుంబీకుల ప్రవేశం...
  • పోలీసుల జోక్యంతో...

మనసమాచార్ - బోధన్

ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ విద్యార్థి తల్లి స్వయంగా కళాశాలకు చేరుకొని విద్యార్థిని చితకబాదిన సంఘటన బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, ఉపాధ్యాయులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిఇసి అభ్యసిస్తున్న గౌరీశ్, ఎంపీసీ చదువుతున్న జీవన్ ల మధ్య సోమవారం చిన్నపాటి గొడవ జరిగింది. ఇరువురిని కళాశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు సముదాయించి గొడవను సద్దుమణిగించారు. కాగా తాజాగా మంగళవారం గౌరీ అనే విద్యార్థి మాతృమూర్తి కళాశాలకు చేరుకొని తరగతి గదిలో నుంచి జీవన్ ను వెంట్రుకలు పట్టుకొని బయటకు ఈడ్చుకోని రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతటితో ఆగకుండా విద్యార్థిపై విచక్షణారహితంగా దాడి చేయడం అందరిని కలిచి వేసింది. ప్రిన్సిపల్ ఉపాధ్యాయుల ఎదురుగానే ఈ దాడి సంఘటన జరగడం శోచనీయం.



ఏది ఏమైనా విద్యార్థుల మధ్య జరిగిన గొడవలు తల్లిదండ్రులు కలిగించుకోవడం శోచనియమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో కళాశాలకు చేరుకొని ఇరువురిని సముదయించారు. ఈ విషయమై ప్రిన్సిపల్ ను వివరాలు అడగగా తాము ఈ ఘటన విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని వివరించారు.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది