మన సమాచార్ - బోధన్
కలియుగ దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి మందిరంలో ప్రసాదం తయారీకి ఉపయోగించిన ఆవు నెయ్యి లో కల్తీ జరిగినట్లు ప్రయోగశాలలో వచ్చిన నివేదిక ఆధారంగా కల్తీకి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని నిజామాబాద్ జిల్లా తెలుగుదేశం పార్టీ శాఖ డిమాండ్ చేస్తున్నది. ఆ పార్టీ నిజామాబాద్ పార్లమెంటరి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది సీహెచ్.వి హన్మంతరావు మాట్లడుతూ పవిత్రమైన ప్రసాదం తయారీలో జంతులవుల కొవ్వు, ముఖ్యంగా పంది కొవ్వుతో కూడిన అవశేషాలు ఉపయోగించినట్లుగా నిర్ణయించబడిన సందర్భంగా దీనికి బాధ్యులైన అప్పటి టిటిడి బోర్డ్ అధ్యక్షులు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, సీఈఓ ధర్మారెడ్డి, గురువా రెడ్డిలను కఠినగం శిక్షించడంతో పాటు సమాజం నుండి వెలి వేయాలని కోరారు. హిందూ మత సాంప్రదాయాలను అగౌరపరిచి సంస్కృతికి కళంకం తెచ్చిన నేతలతో పాటు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగము కలిగే విధంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వ్యహరించిందని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినేవిధంగా కుట్రకు పాల్పడిన రాజకీయ నాయకులను, అధికారులను, కాంట్రాక్టర్లను కఠినంగా శిక్షించడం ద్వారా భవిష్యత్తులో మరి ఎవరు హిందూ బంధువుల నమ్మకాలను, సంష్కృతిని కించపరచరని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రత్యేకమైన, పవిత్రమైన ఆటానమస్ బోర్డ్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి పవిత్రతకు భంగం కలిగించే వారిని శిక్షించే విధంగా, ఆలయ ఆస్తులు తమ భక్తుల విషయంలో అన్య మతస్థుల జోక్యాన్ని నిరోధిస్తూ రక్షణ చట్టం తేవాలని హిందూ సమాజం కోరుతుందని అన్నారు.