విద్యార్థికి వైద్యం చేయించడంలోనూ ప్రజ్ఞ పాఠశాల కక్కుర్తి - ఆర్ ఎం పి తో తలకు కుట్లు - విద్య శాఖ మౌనం ఎందుకు..?


మన సమాచార్ - బోధన్

విద్యార్థుల పట్ల ప్రయివేటు పాఠశాలల నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వేల రూపాయల ఫీజులు ముక్కుపిండి వసూలు చేస్తున్న ప్రజ్ఞా స్కూల్ యాజమాన్యం విద్యార్థుల ఆరోగ్యంపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తుంది. ప్రయివేటు విద్యాసంస్థలకు సంబంధిత విద్యాశాఖ అధికారుల అండదండలు మెండుగా ఉండటంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

పిల్లలను కన్న బిడ్డల వలే చూసుకుంటారని  ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తే అనారోగ్య సమయంలో ప్రజ్ఞ ఉన్నత పాఠశాల ఆర్ఎంపి లతో వైద్యం చేయించి చేతులు దులుపుకుంన్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇటీవల నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ శివారులోని ప్రజ్ఞ ఉన్నత పాఠశాల విద్యార్థి తలకు జరిగిన గాయానికి ఆర్ ఎంపి తో  కుట్లు వేయించడం వివాదాస్పదంగా మారుతుంది. ఆర్ఎంపి లు వైద్య సేవలు అందించే విషయంలో  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విధి విధానాలను రూపొందించినప్పటికి  సదరు ఆర్ ఎంపి వాటిని పరిగణనలోకి తీసుకోక పోవడం వైద్య ఆరోగ్య శాఖ పని తీరును ప్రశ్నించే విధంగా ఉంది. నిపుణులైన వైద్యులు గాయాలకు చికిత్స చేపట్ట వలసి ఉండగా పాఠశాల యాజమాన్యం విద్యార్థికి ఆర్ ఎంపి వైద్యుడితో  తలకు కుట్లు వేయించడం నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఆర్ ఎం పి క్లినిక్ కు కూత వేటు దూరంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. ఇక్కడ ఆసుపత్రిలో విద్యార్థి  చికిత్సకు ఏర్పాటు చేయకుండా ఆర్ఎంపి తో వైద్యం చేయించడం విమర్శలకు దారి తీస్తుంది.  ప్రజ్ఞ ఉన్నత పాఠశాల  విద్యార్థి ఘటన లో విద్యాశాఖ అధికారులు సైతం  మౌనంగానే ఉన్నారు. ఘటన పట్ల లోతైన విచారణ జరిపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి తల్లి దండ్రులకు సమాచారం ఇవ్వడంలో  పాఠశాల యాజమాన్య వ్యవహారం పలు అనుమానాలకు దారి తీస్తుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది