సోషల్ వర్కర్ దళి రత్న అవార్డు గ్రహీత బంగారు సాయిలుకు ఘన సన్మానం...!

 


మన సమాచార్ - కోటగిరి :

కోటగిరి మండల కేంద్రంలోని రాష్ట్ర అభుధ్యయ సోషల్  వర్కర్ దళిత రత్న అవార్డు గ్రహీత  బంగారు సాయిలుకు మాల మహానాడు మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం సందర్భంగా పలువురు మాట్లాడుతూ న్యూఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చౌక్ వద్ద ఏబిసిడి వర్గీకరనకు వ్యతిరేకంగా,  మాలల కులస్తులందరికీ మద్దతుగా సభలో  ఆయన మాట్లాడడం జరిగిందన్నారు. మాలలకు మద్దతుగా ఆయన మాట్లాడడం సంతోషకరమన్నారు. మాలలకు మద్దతుగా  మాట్లాడడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 



ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు మీర్జాపూర్ చిన్న సాయన్న, ఉపాధ్యక్షుడు ఉప్పల సైదయ్య, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బ్యాగరి రాములు, పాల గంగారం, జంగం సాయిలు, కొత్తపల్లి పెద్ద సైదయ్య, సేవాలాల్ సేన మండల అధ్యక్షుడు తారా సింగ్ నాయక్, ఎత్తోండ క్యాంప్ తుకారాం, సంజు, ఆవుల గంగారం, దండు భూమయ్య, లాలు, కొల్లూరు రమేష్, మారుతి పాల పోశెట్టి, రామచందర్, కొత్తంగల్ భీమ్రావు, ఆయా గ్రామాల అంబేద్కర్ సంఘ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది