మన సమాచార్ - జుక్కల్
జుక్కల్ మండలంలొ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహం, ఎస్సి బాలుర వసతి గృహలను సందర్శించి వసతి గృహల్లోని విద్యార్థిని, విద్యార్థుల వసతులు, హాజరు పట్టికలను పరిశీలించారు. ప్రతి రోజు విద్యార్థిని, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల, కస్తూర్బ గాంధీ బాలికల గురుకుల పాఠశాలలు సందర్శించి సమస్యల గురించి విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు.
వసతి గృహ నిర్వాహకులు విద్యార్థుల పట్ల శ్రద్ద వహించాలని, ప్రతి రోజు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. జుక్కల్ ప్రభుత్వ అస్పత్రి ని సందర్శించి అస్పత్రి లొ రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. సబ్ కాలెక్టర్ సందర్శన సందర్బంగా మండలం లొ విద్య వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని దీనికి ప్రధాన కారణం మండల విద్య శాఖదికరే కారణమని సి ఐ టి యు, ఎస్ ఎఫ్ ఐ నాయకులు సబ్ కాలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మండలం లోని పలు హై స్కూల్ లలో విద్యార్థులకు విద్య ను బోధించడానికి కావాల్సిన ఉపాధ్యాయులు లేకపోవడం తో సరైన విద్య అందడం లేదని, కాసు లిస్తే చాలు ఎం ఇ ఓ ఉపాధ్యాయులను ఎక్కడి నుండి ఎక్కడికైనా డిప్యుటేషన్ చేస్తున్నాడని, ఉపాధ్యాయులు వారి విధులను సక్రమంగా నిర్వహించకున్న కాసులిస్తే అన్ని సక్రమంగా ఉన్నట్లు ఎం ఇ ఓ తీరు ఉందని నియోజకవర్గం లొ ఇద్దరే ఎం ఇ ఓ లు ఉండగా వీరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదాని సబ్ కాలెక్టర్ దృషకి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సబ్ కాలెక్టర్ విద్య వ్యవస్థ ను మెరుగు పర్చే విధంగా తప్పకుండ తగిన చర్యలు తీసుకుంటానని మరోసారి తప్పకుండ ఆకస్మాత్తుగా మండలంను సందర్శిస్తానని విధుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్న ఎం ఇ ఓ పై తప్పకుండ చర్యలు తీసుకుంటానని తెలిపారు. సబ్ కలెక్టర్ వెంట తహసిల్దార్ హిమబిందు, ఎంపీడిఓ శ్రీనివాస్, ఆర్ ఐ రామ్ పాటిల్, డాక్టర్. విట్టల్ తదితరులు ఉన్నారు.