నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనం పై చర్యలు తీసుకోండి - సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన బిజెపి నాయకులు...!


మన సమాచార్ - బాన్సువాడ

బొర్లం రోడ్డులో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనం పై విచారణ చేపట్టాలని, చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. బాన్సువాడ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో  బీజేపీ నాయకులు శుక్రవారం సబ్ కలెక్టర్ కు  వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ భవన అనుమతులను ఆర్టిఐ ద్వారా ఇవ్వండి అని మున్సిపాలిటీకి అడగగా అనుమతి తీసుకున్నట్టు మా రికార్డులలో లేదని  మున్సిపల్ అధికారులు సమాధానం ఇచ్చారరన్నారు. రికార్డులలో బిల్డింగ్ అనుమతులు లేనప్పుడు బిల్డింగ్ కి ఇంటి నెంబర్ ఇచ్చి టాక్స్ పన్ను ఎలా వసూలు చేస్తున్నారని  ప్రశ్నించారు.  బాన్సువాడ మండలం బోర్లం గ్రామ పంచాయితీలో ఒక ఇంటి నంబరు తీసుకుని ఇటు బాన్సువాడ మున్సిపాలిటీ, ఒక ఇంటి నెంబర్ తీసుకుని అటు గ్రామపంచాయతీకి ఇటు మున్సిపాలిటీకి ఇంటి పన్ను ఎగవేస్తున్నారని ఆరోపించారు. భవన నిర్మాణం చేపట్టిన నాటి నుండి ఇప్పటివరకు ఇంటి పన్ను వసూలు చేయాల్సింది ఉండగా ఒకే సంవత్సరం ఇంటి పన్ను వసూలు చేసి చేతులు దులుపుకున్నారన్నారు. బోర్లం గ్రామపంచాయతీ నుండి బీఈడీ కాలేజీ అనుమతులు తీసుకొని బాన్సువాడలో నడిపిస్తున్న వైనాన్ని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకోవెళ్లడం జరిగిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు పొందిన భవనం పై చర్య తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు తృప్తి ప్రసాద్, కొనాల గంగారెడ్డి, సాయి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది