చిన్న రాంపూర్ విద్యార్థులకు పరీక్ష అట్టలు పెన్నుల పంపిణీ...!


మన సమాచార్ - బాన్సువాడ

బాన్సువాడ మండలంలోని చిన్న రాంపూర్ గ్రామంలో ఎన్ఆర్ఐ కుర్మ మారుతి ఆధ్వర్యంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులను శుక్రవారం అందజేశారు. ఎన్ఆర్ఐ కుర్మ మారుతి సహకారంతో గ్రామ యూత్ ప్రెసిడెంట్ కుర్మ గణేష్, దేశాయిపేట్ సొసైటీ డైరెక్టర్ పరిగె మోహన్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంజయ్య, సంగెం పరమేష్, ప్రధానోపాధ్యాయులు వీరప్ప, నక్క ప్రవీణ్, ఉపాధ్యాయులు వెంకట రమణ, శ్రీనివాస్, నరసింహ రాజు, బాల్ సింగ్, మంజుల, గంగమణి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది