బావుల పునరుద్ధరణ పారిశ్రామిక వేత్తల చేతిలోకి...!


మన సమాచార్ - హైదారాబాద్

చారిత్రాత్మక ప్రసిద్ధి పొందిన పురాతన బావుల పునరుద్ధరణ కు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. తెలంగాణ  టూరిజం శాఖ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చెందే కార్యక్రమంలో భాగంగా ఈ బావులను పారిశ్రామికవేత్తలకు అప్పగించారు. రెసిడెన్సీ మెట్ల బావిని కోటి ఉమెన్స్ కాలేజ్ ఆధ్వర్యంలో పునరుద్ధరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తలకు ఒప్పంద పత్రాలను అందజేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలఖ బావిని ఇన్ఫోసిస్ సంస్థ పునరుద్ధరించి పర్యాటక కేంద్రం తీర్చి దిద్దడానికి  ఒప్పందం కుదుర్చుకుంది. మంచిరేవుల మెట్ల బావిని సాయి లైఫ్ సంస్థ దత్తత తీసుకోండి సాలార్ జంగ్, అమ్మ పల్లి బావులను పునరుద్ద రించడానికి భారత్ బయో టెక్ సంస్థ ముందుకు వచ్చింది. ఫలక్ నామ మెట్ల బావిని ఆర్టీసీ, అడీక్ మెట్ మెట్ల బావిని దొడ్ల డెయిరీ దత్తత తీసుకున్నాయి. గత ప్రభుత్వాలు పట్టణంలోని అనేక చారిత్రాత్మక కట్టడాలను నిర్లక్ష్యం చేశారని వాటి పునరుద్ధరణకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పాత అసెంబ్లీ భవనాన్ని సైతం పునరుద్ధరించడానికి ఏర్పాట్లు చేస్తామని వివరించారు. ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ స్టేడియానికి తరలిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ సిటీ కాలేజ్ ఫోన్ తో పాటు పురాణ పోలీస్ సైతం పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసాద్, సిఐఐ తెలంగాణ చైర్మన్ సాయి ప్రసాద్, ముఖ్యమంత్రి ఓ ఎస్ డి వేముల శ్రీనివాస్ పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది