బోధన్, డిసెంబర్ 14 (మన సమాచార్):
బోధన్ కోర్టు ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ లో 3600 కేసులను పరిష్కరించారు. కక్షిదారులకు ఒక కోటి ముప్ఫై లక్షల ఐదు వందల పది రూపాయలు చెల్లించడంతో పాటు జరిమానా ల రూపంలో ఇరవై ఐదు లక్షల ఏడువందల ముప్ఫై రూపాయలు జమా అయ్యాయి. కోర్టులో నాలుగు బెంచీల ద్వారా 149 కేసులను పరిష్కారం చేసి, ఒక కోటి 30 లక్షల 54,510 రూపాయలు కక్షిదారులకు చెల్లించారు. స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు (రెండవ తరగతి)లో 3,451 కేసులు పరిష్కారం చేసి జరిమానా రూపంలో ప్రభుత్వానికి 25 లక్షల 730 రూపాయలు జామా అయ్యాయి. ఈ సందర్భంగా బోధన్ మండల న్యాయ సేవ కమిటీ చైర్మన్, ఐదవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్ రవికుమార్ మాట్లాడుతూ రాజీ మార్గమే రచమర్గమని అన్నారు. మొదటి బెంచ్ లో న్యాయమూర్తి ఎస్ రవికుమార్, న్యాయవాది డాక్టర్ మధు సింగ్, ద్వితీయ శ్రేణి ప్రత్యేక జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎ. శేషతల్ప శాయి, రెండవ బెంచ్ లో న్యాయమూర్తి దేవన్ అజయ్ కుమార్, న్యాయవాది మారుతి రావు ఖన్నా, మూడవ బెంచిలో న్యాయమూర్తి ఎం పూజిత, న్యాయవాది సిహెచ్వి హనుమంతరావు, నాలుగవ బెంచి లో న్యాయమూర్తి సాయి శివ, న్యాయవాది జి కళ్యాణి లు కేసులను పరిష్కరించారు.