కంటి చూపు ఆపరేషన్ కి నిరుపేదకు చేయూతనందించిన డాక్టర్ ఎంఏ హకీమ్...!

 


కోటగిరి, డిసెంబర్ 12, (మన సమాచార్):

పోతంగల్ మండలంలోని కంటి చూపు ఆపరేషన్ కు సామాజిక సేవ కర్త ఎంఎ హకీమ్ ఆర్థిక సహాయం అందించారు. పాత పోతంగల్ గ్రామానికి చెందిన నిరుపేద అనిఫా బేగం (50) కు కంటి చూపు తగ్గడంతో ఇబ్బందుల కు గురవుతున్న విషయం తెలుసుకొని కంటి చూపు ఆపరేషన్ కు దాతగా నిలిచారు. రెండవ కంటికి కూడా ఆరు నెలల తర్వాత ఆపరేషన్ చేయించుకునేందుకు సహాయం చేస్తానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.  నిరుపేదలకు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇలాంటి సేవలు చేయటానికి తానెప్పుడూ ముందు ఉంటాననీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన వెంట షేరు, గఫర్, తదితరులు ఉన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది