వర్ని, డిసెంబర్ 14 (మన సమాచార్):
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణ గ్రామ పంచాయితీ పరిధిలోని కోటయ్య క్యాంప్ లో శనివారం రాత్రి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం చేపట్టారు. గ్రామంలోని పిల్లలు, మహిళలు ప్రతి శనివారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ చేపడుతున్నారు. అనంతరం నెహ్రునగర్ ప్రసాద్ రావు హనుమాన్ చరిత్రను వివరించారు.