బోధన్ డిసెంబర్ 16 (మన సమాచార్):
కొత్త బస్టాండ్ ప్రాంతంలో పలువురిని ఆట పట్టిస్తున్న (ఇవ్ టీసింగ్) ఇద్దరు ఆకతాయిలకు రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ తీర్పు చెప్పారని బోధన్ పట్టణ ఎస్ హెచ్ వో వెంకటనారాయణ తెలిపారు. ఇద్దరు ఆకతాయిలు తరచూ ఆట పట్టిస్తూ ఇబ్బందులు కలిగిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు అరెస్టు చేసి రిమాండ్ చేశామని తెలిపారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జనవాసాల మధ్య మద్యం సేవించిన మరో ఇద్దరు వ్యక్తులకు సైతం సమాజ సేవ (community service punishment) శిక్ష విధించారని వెల్లడించారు. జనవాసాలలో ఎవరు కూడా మద్యం సేవించవద్దని, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం నేరమని తెలిపారు. ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు కనిపిస్తే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు.